Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్ మలక్ పేట పరిధిలోని మాదన్నపేట్ కూరగాయలమార్కెట్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం ఉద్రిక్తత కు దారి తీసింది. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహ దిమ్మను గుట్టుచప్పుడు కాకుండా కూల్చి వేశారు. ఈ ఘటన ఉదయం వెలుగులోకి రావడంతో దళిత సంఘాల నేతలు ఘటన స్థలానికి భారీగా చేరుకున్నారు. అనంతరం కూల్చివేత కు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూల్చివేసిన విగ్రహ దిమ్మను జై భీమ్ అంటూ దళిత సంఘాల నేతలు పునర్ నిర్మించారు. అంబేద్కర్ విగ్రహం జోలికొస్తే ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. కాగా విగ్రహ దిమ్మ తిరిగి ఏర్పాటు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఘటనపై మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు.
Admin
Studio18 News