Studio18 News - తెలంగాణ / : కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా ఛలో సచివాలయం కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు. నిన్న గ్రూప్-1 అభ్యర్థుల మీద పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిని పరామర్శించేందుకు బండి సంజయ్ అశోక్ నగర్ వెళ్లారు. వారిని పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో వారితో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. తాము సచివాలయానికి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఖర్చు చేసిన ఆ డబ్బు బీఆర్ఎస్‌దే హర్యానా, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిన డబ్బు బీఆర్ఎస్‌దేనని బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితికి కారణమన్నారు. ఆయన వల్లే కేసీఆర్ సర్వనాశనం అయ్యారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని, అసలు దోస్తీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉందన్నారు. కాళేశ్వరంపై విచారణ జరుపుతామని కాంగ్రెస్ చెప్పిందని, మరి ఏమయిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు 41 సీఆర్పీసీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని నిలదీశారు.
Admin
Studio18 News