Wednesday, 10 December 2025 02:42:07 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Vinod Kumar | అల్మ‌ట్టి ఎత్తు పెంచేందుకు క‌ర్ణాట‌క య‌త్నం.. ఇప్ప‌టికీ స్పందించ‌ని రేవంత్‌పై మాజీ ఎంపీ వినోద్ ఫైర్

Vinod Kumar | అల్మ‌ట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం య‌త్నిస్తుంటే.. ఇప్ప‌టికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించ‌

Date : 18 September 2025 07:19 PM Views : 162

Studio18 News - TELANGANA / HYDERABAD : Vinod Kumar | హైద‌రాబాద్ : అల్మ‌ట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు క‌ర్ణాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం య‌త్నిస్తుంటే.. ఇప్ప‌టికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించ‌కపోవ‌డంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ అంశంపై తెలంగాణ భ‌వ‌న్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

కృష్ణా ట్రిబ్యునల్ 2013లో అల్మ‌ట్టి ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి తీర్పు ఇచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తీర్పుఫై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో అప్పటి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ వేస్తే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే వచ్చింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు స్టే కొనసాగించేలా చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం అల్మ‌ట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. నిన్న కర్ణాటక ప్రభుత్వం అల్మ‌ట్టి ప్రాజెక్టు విస్తరణ కోసం లక్షా 33 వేల ఎకరాల భూ సేకరణ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. ఈ భూ సేకరణ కోసం రెండేళ్లలో రూ. 70 వేల కోట్లు ఖర్చు పెట్టాలని కర్ణాటక లక్ష్యంగా పెట్టుకుంది. క‌ర్ణాటకలో ఉన్న‌ది కాంగ్రెస్ ప్రభుత్వమే. కర్ణాటక అల్మ‌ట్టిపై నిర్ణయం తీసుకుని రెండు రోజులు అవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదు. సుప్రీంకోర్టు స్టే పెండింగ్‌లో ఉండగానే కర్ణాటక అల్మ‌ట్టి ఎత్తు పెంచడానికి తీసుకున్న నిర్ణయంపై తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కృష్ణా నదిలో ఒక్క నీటి చుక్కను వదలుకోమని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఓ సమీక్ష సమావేశంలో చెప్పారు. మరి కర్ణాటక అక్రమంగా అల్మ‌ట్టి ఎత్తు పెంచుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కర్ణాటక నిర్ణయంపై స్పందించారు. అల్మ‌ట్టి ఎత్తు పెంచితే తమ రాష్ట్రంలోని రెండు జిల్లాలు సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో ముంపు ఉంటుందని మహారాష్ట్ర సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అల్మ‌ట్టి ఎత్తు పెంపును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని అడ్డుకుని తీరుతామని ఫడ్నవీస్ హెచ్చరించారు అని వినోద్ కుమార్ గుర్తు చేశారు. కేసీఆర్‌పై ద్వేషమే తప్ప రేవంత్ రెడ్డికి కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని లేదు. కేసీఆర్ పట్టుదలతోనే సెక్షన్ 3 ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయి. కేసీఆర్ కృష్ణా ట్రిబ్యునల్ కోసం 33 లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తగ్గించారని కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పదే పదే నిందలు వేస్తున్నారు. నిన్న కూడా సెప్టెంబర్ 17 వేడుకల ప్రసంగంలోనూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విషం చిమ్మారు. తెలంగాణ ఏర్పడ్డ నెల రోజులకే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం లేఖ రాశారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటును మహారాష్ట్ర, కర్ణాటక వ్యతిరేకించినా కేసీఆర్ మాటనే చివరకు నెగ్గింది. కేసీఆర్‌పై నిందలు మాని అల్మ‌ట్టిపై కర్ణాటక దూకుడును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా..? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సుప్రీంకోర్టులో కర్ణాటకకు వ్యతిరేకంగా కంటెంప్ట్ పిటిషన్ వేయాలి. అల్మ‌ట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :