Sunday, 29 March 2026 05:19:00 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Jeevan Reddy: రేవంత్ రెడ్డి ఆ రోజు రాళ్లతో కొట్టమన్నారు కానీ..!: జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Date : 06 February 2026 07:35 PM Views : 58

Studio18 News - TELANGANA / HYDERABAD : పార్టీ మారిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టమన్నారని గుర్తు చేసిన జీవన్ రెడ్డి మనం ఓట్లతో కొడదామని జగిత్యాలలో పిలుపునిచ్చిన జీవన్ రెడ్డి తన గొంతు కోయాలని చూస్తున్నారని ఆగ్రహం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమని చెప్పారని, కానీ ఇప్పుడు నేను ఓట్లతో కొడదామని చెబుతున్నానని కాంగ్రెస్ పార్టీ జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను అధికార పార్టీలో చేరలేదని, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని వివరణ ఇచ్చారు. నాటి నుంచి జీవన్ రెడ్డి అలక బూనారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లోనూ సంజయ్ వర్గానికి ముప్పై సీట్లు, తన వర్గానికి 20 సీట్లు మాత్రమే ఇచ్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారి తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న చెప్పారని, అలాంటప్పుడు ఆయన అదే పార్టీలో ఉండాలని, కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఆయన పార్టీని చక్కదిద్దుకోవాలి తప్ప తన పార్టీలో చిచ్చు పెట్టవద్దని సూచించారు. ఇన్నాళ్లు తాను పార్టీ జెండాను మోస్తే ఇప్పుడు వచ్చి ఆయన తన్నుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నా గొంతు కోద్దామని చూస్తున్నారని, తన గొంతు కోయాలంటే తన కార్యకర్తలను దాటి రావాలని అన్నారు. జీవితం అయిపోయే ముందు తనకు దుఃఖం తెప్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టమని చెప్పినప్పటికీ మనం ఓటు అనే ఆయుధంతో కొడదామని అన్నారు. చేయి గుర్తును తన్నుకుపోయారని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :