Studio18 News - TELANGANA / HYDERABAD : అంగరంగ వైభవంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్, మార్చి 27: షాబాద్ మండలంలోని సీతారాంపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకకు గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ సీతారాముల కళ్యాణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుందని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణం వైభవంగా కొనసాగగా, భక్తులు హర్షధ్వానాలతో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పావని చెన్నయ్య, రుద్రారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
Admin
Studio18 News