Studio18 News - TELANGANA / RANGAREDDY : సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించినట్లు జక్కిడి సత్య తేజ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జక్కిడి సత్య తేజ రెడ్డి మాట్లాడుతూ మహిళ సాధికారతకు, విద్య విస్తరణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె ఆశయాలను అందరూ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పృథ్వీరాజ్, శ్యామల్ రెడ్డి, విటల్ రెడ్డి, గంట శ్రవణ్, రాజశేఖర్ రెడ్డి, జానీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News