Saturday, 07 March 2026 09:19:33 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

అల్లు అర్జున్ అత్యవసర పిటిషన్... ఉదయం మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు

ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశాం.. అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాది ఉదయం గం.10.30కే మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు సోమవారం వరకు చర్యలు తీసుకోకు

Date : 13 December 2024 03:09 PM Views : 542

Studio18 News - TELANGANA / : అరెస్ట్ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని, దీనిని అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే మధ్యాహ్నం చెబితే ఎలా అంటూ హైకోర్టు పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. అయితే తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఉదయమే మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ కోసం ఆయన న్యాయవాది ప్రయత్నాలు చేశారు. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం వేశామని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే అత్యవసర పిటిషన్ అయితే ఉదయం గం.10.30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు... అల్లు అర్జున్ న్యాయవాదిని ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్ అంశాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్ కోరారు. మధ్యాహ్నం గం.1.30 సమయానికి లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదని పీపీ తెలిపారు. సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని విజ్ఞప్తి సోమవారం వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు వివరాలు సమర్పిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలక వాయిదా వేశారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాం: సీపీ సీవీ ఆనంద్ కాగా, అల్లు అర్జున్ అరెస్ట్ ను పోలీసులు నిర్దారించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిన్నట్టు లా అండ్ ఆర్డర్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం అతనిని కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.

Also Read : ఒక యోగిలా ఉన్నారు... ఆయనను చూస్తుంటే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తోంది: మంత్రి పయ్యావుల

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :