Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తడి-పొడి విధానం ద్వారా వరి యాజమాన్యం, నేరుగా వరి విత్తడం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం వంటి పద్ధతులను వివరించారు. నూతన సాగు పద్ధతులను అనుసరించడం వలన పెట్టుబడి తగ్గడమే కాకుండా కూలీల ఖర్చు సుమారు ఎనిమిది వేల రూపాయల వరకు ఆదా అవుతుందని, సాగు సమయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు చీడపీడల నివారణ కూడా సులభతరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ రాకేష్, జెసీఎఫ్ అరవింద్ రెడ్డి, కమ్యూనిటీ ఫెసిలిటేటర్ బాలు రైతులకు ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజినీ దేవి, వైస్ సర్పంచ్ శేఖర్ రెడ్డి, గ్రామ రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Studio18 News