Sunday, 29 March 2026 05:22:06 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

KCR: మరో రెండేళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు... అప్పుడు మిగిలిన పనులు చేసుకుందాం: హరీశ్ రావు

Date : 05 February 2026 06:44 PM Views : 28

Studio18 News - TELANGANA / JOGULAMBA GADWAL : గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ రావు మనల్ని బాగా చూసుకునే వారికి ఓటు వేయాలని పిలుపు ధైర్యం ఉంటే అభివృద్ధిలో కేసీఆర్‌తో పోటీ పడాలని ముఖ్యమంత్రికి సవాల్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో రెండేళ్లలో మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసుకుందామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఏమీ చేయరని విమర్శించారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ, మనల్ని బాగా చూసుకునే వారికే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు పందులతో ఉన్న గజ్వేల్ ఆసుపత్రి కేసీఆర్ వచ్చాక ఎలా అయిందో అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది కానీ వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ఇవ్వలేదు కానీ బంగారం ధర మాత్రం భారీగా పెరిగిందని అన్నారు. అప్పుడు బంగారం ఆశపెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై తిట్ల వర్షం కురిపించడం తప్ప రేవంత్ రెడ్డికి తెలిసిందేమీ లేదని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్‌లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. ఎన్నికల తర్వాత రైతు బంధు ఇస్తామని ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ ఈ నెల 11 లోపు ఇవ్వకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే అభివృద్ధి విషయంలో కేసీఆర్‌తో పోటీ పడాలని సవాల్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :