Sunday, 29 March 2026 05:25:17 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Harish Rao: నీతులు చెప్పే డీజీపీ ఖాకీ బుక్ ఎక్కడకు వెళ్లింది?: హరీశ్ రావు

Date : 19 January 2026 06:59 PM Views : 353

Studio18 News - TELANGANA / HYDERABAD : ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా? అన్న హరీశ్ రావు కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలపై మౌనం వహిస్తున్నారని విమర్శ జర్నలిస్టులు, బీఆర్ఎస్ నేతలపై మాత్రం సిట్ లు వేస్తున్నారని మండిపాటు కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలపై పోలీసులు మౌనం పాటించడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. చట్టం అందరికీ సమానమని చెబుతూ నీతులు చెప్పే డీజీపీ శివధర్‌రెడ్డి ఖాకీ బుక్ ఇప్పుడు ఎక్కడికెళ్లిందని ఎద్దేవా చేశారు. “ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలంపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఏఐసీసీ నేత, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కాంట్రాక్టర్లను రూ.8 కోట్లు ఇవ్వాలని బెదిరించాడని ఆరోపించారు. ఈ వ్యవహారంలో స్వయంగా బాధిత కాంట్రాక్టరే ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ ఎందుకు వేయలేదని నిలదీశారు. జర్నలిస్టులు, బీఆర్ఎస్ నేతలపై మాత్రం సిట్‌లు, కమిషన్లు వేస్తారని, కాంగ్రెస్ నేతల విషయంలో ఎందుకు నిబంధనలు మారతాయని హరీశ్‌రావు మండిపడ్డారు. జర్నలిస్టుల కేసులో సిట్ ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని చెబుతున్నారని, అదే నిజమైతే ఆయన ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమైనట్టే అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిపాలన బాధ్యత వహించే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చట్టాన్ని రాజకీయాల కోసం వాడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హరీశ్‌రావు హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :