Studio18 News - తెలంగాణ / : konda surekha comments on samantha: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయారని ఆమె ఆరోపించారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తో పాటు.. టాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. అక్కినేని నాగార్జు, అక్కినేని అమల, అక్కినేని నాగచైతన్య, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నానితోపాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు స్పందిస్తూ.. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ విషయంపై తీవ్ర వివాదంగా మారుతున్న క్రమంలో కొండా సురేఖ వెనక్కు తగ్గారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. గురువారం హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భావోద్వేగానికి గురైనట్లు, కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. తనకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు.. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడినట్లు సురేఖ పేర్కొన్నారు. ఏ విషయంలో నేను బాధపడ్డానో.. ఆ విషయంలో మరొకరిని నొప్పించానని తెలిసి వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నానని తెలిపారు. కేటీఆర్ విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని కొండా సురేఖ అన్నారు. ఆయన చేసిందంతా చేసి నన్ను క్షమాపణ చెప్పమనడం దొంగే దొంగాదొంగా అన్నట్లుగా ఉంది. కేటీఆర్ లీగల్ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తాం అని కొండా సురేఖ తెలిపారు.
Admin
Studio18 News