Thursday, 26 March 2026 04:57:46 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

నీటి సంరక్షణలో మహిళల పాత్ర కీలకం: ఉపసంచాలకులు శ్రీనివాస్ బాబు

Date : 25 March 2026 12:38 PM Views : 7

Studio18 News - TELANGANA / NIRMAL : మార్చి 24, 2026-నిర్మల్: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బండల్ ఖానాపూర్ గ్రామంలో మంగళవారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో ‘అవల్ రూరల్ లైవిలిహుడ్ ఎంపవర్‌మెంట్ సొసైటీ’ (స్వచ్ఛంద సంస్థ) సహకారంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ‘నీరు, లింగ సమానత్వం’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా భూగర్భ జల శాఖ ఉపసంచాలకులు పి. శ్రీనివాస్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించాలని, భావి తరాల కోసం నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా నీటి నిర్వహణలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, వృథాగా పోయే ప్రతి నీటి బొట్టును భూమిలోకి మళ్లించాలని కోరారు. గ్రామస్థులంతా నీటి పొదుపును ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పలువురిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :