Sunday, 29 March 2026 05:25:39 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Revanth Reddy: రేవంత్ రెడ్డిలో రాము, రెమో.. ఇద్దరూ ఉన్నారు: కేటీఆర్

Date : 21 January 2026 06:53 PM Views : 130

Studio18 News - TELANGANA / HYDERABAD : సినిమా టిక్కెట్లు పెంచబోమని చెబుతూనే, ధరల పెంపుకు జీవో జారీ చేస్తారని విమర్శ సర్వాయి పాపన్న పేరుపై జిల్లా చేస్తామని చెబుతూనే జనగామ జిల్లాను తొలగిస్తామంటున్నారని ఆగ్రహం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్ జనసేన సహా ఏ పార్టీ అయినా పోటీ చేయవచ్చని స్పష్టీకరణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో రెండు కోణాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకటి 'రాము' అయితే, మరొకటి 'రెమో' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఒకవైపు సినిమా టిక్కెట్లను పెంచబోమని చెబుతూనే, మరోవైపు టిక్కెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేస్తోందని అన్నారు. సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లాను ఏర్పాటు చేస్తామని చెబుతూనే, తిరిగి అదే జిల్లాను తొలగిస్తామని చెబుతున్నారని విమర్శించారు. అందుకే ఆయనలో రాము, రెమో కోణాలు ఉన్నాయని చెబుతున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 40 శాతం సర్పంచ్‌లను గెలుచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు శివరాత్రి లోపలే ముగుస్తాయని అభిప్రాయపడిన కేటీఆర్, తాము ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వచ్చేది అసెంబ్లీ ఎన్నికలేనని జోస్యం చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులను, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిన మాటలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. సర్వేలు, పార్టీ బలాబలాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో జనసేనతో సహా ఎవరైనా పోటీ చేయవచ్చని అన్నారు. క్షేత్రస్థాయిలో బలం ఉంటేనే స్థానిక ఎన్నికల్లో గెలవడం సులభమవుతుందని అన్నారు. జనగామ, నారాయణపేట సహా పలు జిల్లాలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే జిల్లాలను రద్దు చేయడం ఖాయమని అన్నారు. స్థానిక సమస్యల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేస్తారని ఆయన అన్నారు. ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అధికార పార్టీ నాయకులు ఆరోపణలను నిరూపించలేకపోయారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనతో జంట నగరాల అస్థిత్వం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, దీనిని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకువెళతామని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :