Monday, 30 March 2026 02:56:47 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Kishan Reddy: హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతుంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Date : 03 February 2026 08:08 PM Views : 58

Studio18 News - TELANGANA / HYDERABAD : వికసిత్ భారత్ 2047 కోసం పెట్టిన బడ్జెట్ అన్న కిషన్ రెడ్డి ఉచిత పథకాల కోసమే బడ్జెట్ అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2026-27 బడ్జెట్ ఎన్నికల కోసం కాకుండా వికసిత్ భారత్-2047 కోసం తీసుకువచ్చిన బడ్జెట్ అన్నారు. ఉచితాలు ప్రవేశపెట్టడం కోసమే బడ్జెట్ అన్నట్లుగా రాజకీయ పార్టీలు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందని అన్నారు. వీబీ జీ రామ్ జీ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ పథకానికి బడ్జెట్‌లో 9 శాతం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 4.30 లక్షల ఇళ్లు కేటాయించామని, మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు కేటాయించిందని అన్నారు. నైనీ బొగ్గు బొగ్గు గనుల వ్యవహారంలో తెలంగాణ మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దగా వల్లే సింగరేణి భ్రష్టు పట్టిందని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కేసీఆర్ మార్చుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకుందని విమర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :