Sunday, 29 March 2026 05:21:38 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Ramachander Rao: మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

Date : 06 February 2026 06:41 PM Views : 25

Studio18 News - TELANGANA / HYDERABAD : తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా బీజేపీ గెలిస్తే పెండింగ్ పనుల్లో వెసులుబాటు కల్పిస్తామన్న రామచందర్ రావు యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని హామీ తెలంగాణలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌లు అశోక్ పర్ణామి, రేఖా శర్మతో కలిసి 'వికసిత్ తెలంగాణ.. బీజేపీ సంకల్ప పత్రం' పేరుతో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలిస్తే పెండింగ్ పనుల్లో వెసులుబాటు కల్పిస్తామని, మోడ్రన్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామని తెలిపారు. అవినీతిరహిత మున్సిపాలిటీలే తమ లక్ష్యమని తెలిపారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని చూసి భయపడుతున్నాయని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారని, ఏ జిల్లాకు ఎంతిచ్చామో కూడా చెబుతామని అన్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమిచ్చారో చెబుతారా అని నిలదీశారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను తమ కార్యకర్తల్లా ఉపయోగించుకుంటోందని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :