Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు అవతలి వైపు చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులు 30 గంటలుగా నరకయాతన అనుభవించారు. బుధవారం నుండి భారీ వర్షాలకు ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చడంతో మానేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది.. గేదెలను మేపడానికి అవతలి వైపు వెళ్లిన కాపరులతోపాటు రైతులు మొత్తం ఆరుగురు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇందులో ఎగువ మానేరు ప్రాజెక్టు దగ్గర నర్మాల గ్రామానికి చెందిన కాడి నాగం గల్లంతు కాగా ... ఐదుగురు వాగు అవుతలి గడ్డకు చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన సంవత్సరం అందుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ మహేష్ కుమారులు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పిలిపించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా బుధవారం రాత్రికి కూడా బాధితులను తీసుకురాలేకపోయారు. బాధితులను కాపాడేందుకు 30 గంటలుగా వారు శ్రమించారు. సమాచారం అందుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో మాట్లాడి రెండు ఆర్మీ హెలికాప్టర్లను పంపాలని విన్నవించారు. కాగా.. గురువారం భారీ వర్షాల నేపథ్యంలో హెలికాప్టర్ల రాక ఆలస్యమైంది. మధ్యాహ్నం వర్షం తగ్గడంతో మరోసారి ఆర్మీ అధికారులతో బండి సంజయ్ మాట్లాడి రెండు హెలికాప్టర్లను నర్మాలకు తెప్పించారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఐదుగురు బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రెస్క్యూ ఆపరేషన్ ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా.. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారిని క్షేమంగా గమ్యం చేర్చారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Admin
Studio18 News