Sunday, 29 March 2026 05:19:04 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Sanjay Kumar Jagtial: జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారినట్లు ఆధారాలు లేవనడంపై స్పందించిన కేపీ వివేకానంద

Date : 04 February 2026 07:41 PM Views : 46

Studio18 News - TELANGANA / JAGTIAL : సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో ఎందుకు చేర్చుకున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారన్న వివేకానంద ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారని ఆగ్రహం స్పీకర్ కాలయాపన చేస్తూ ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ తమ పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. కానీ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అనర్హత పిటిషన్లపై కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేవంటూ ఎనిమిది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కూడా కుమ్మక్కయిందని ఆరోపించారు. స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదు: జగదీశ్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నా స్పీకర్ కు కనబడకపోవడం విచారకరమని అన్నారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బహిరంగంగా సభలకు, కాంగ్రెస్ కార్యక్రమాలకు హాజరవుతున్నారని, అది స్పీకర్‌కు కనపడటం లేదా అని నిలదీశారు. సభాపతి ఆత్మసాక్షిగా, చట్టపరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. స్పీకర్ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం చట్టవిరుద్ధమేనని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ వదిలేసినా కోర్టుల్లో శిక్ష తప్పదని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :