Studio18 News - తెలంగాణ / : సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి మంత్రి కొండా సురేఖ నాంపల్లి ప్రత్యేక కోర్టులో రిప్లై ఫైల్ చేశారు. నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో నాగార్జునపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగార్జున సహా సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు ఇదివరకే నమోదు చేసింది. ఈ క్రమంలో తాజాగా, మంత్రి రిప్లైని ఫైల్ చేశారు. మంత్రి తరఫున ప్రముఖ న్యాయవాది గుర్మీత్ సింగ్ కోర్టులో సమాధానాన్ని ఫైల్ చేశారు. అనంతరం కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ఆమె వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.
Admin
Studio18 News