Saturday, 14 December 2024 06:27:09 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Hyderabad news: మూసీ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం

Date : 03 October 2024 11:31 AM Views : 31

Studio18 News - తెలంగాణ / : మూసీ బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తున్నా కొందరు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మూసీ నిర్వాసితుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించే వారు. దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తున్నా వారిలో చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25వేలు ప్రోత్సాహకం అందించనుంది. ఇల్లు ఖాళీ చేస్తున్న సమయంలోనే రెవెన్యూ అధికారులు వారికి ఈ మొత్తం అందించనున్నారు. ఇల్లు ఖాళీ చేసిన వెళ్లిన తర్వాత వారం రోజుల పాటు వారికి ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం కేటాయిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంతంలో పనులు దొరక్కపోవడం, చిరు వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయించుకోవడానికి అనువైన పరిస్థితులు ఉండకపోవడం వంటి కారణాలను బాధితులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. తమకు సమీపంలోనే రెండు మూడు కిలో మీటర్ల దూరంలో కేటాయించాలని కోరుతున్నారు. దీంతో హిమాయత్‌నగర్, అంబర్‌పేట, రాజేంద్రనగర్, గండిపేట మండలాల పరిధిలో ఉంటున్న వారికి పిల్లిగుడెసెలు, జియాగూడ, నార్సింగి ప్రాంతంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకూ 40 శాతం మంది మాత్రమే ఇళ్లు ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో ఇళ్లు ఖాళీ చేయకుండా అక్కడే ఉన్న 60 శాతం మంది కుటుంబాల ఇబ్బందులను తెలుసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఈరోజు, రేపు ప్రతి కుటుంబాన్ని కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని భావిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :