Studio18 News - TELANGANA / JAGTIAL : స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతజీ సుభాశ్ చంద్రబోస్ జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కెంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ చౌరస్తా వద్ద నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ' స్వాతంత్ర్యం అంటే అడిగి తీసుకునే బిక్ష కాదు.. పోరాడి సాధించుకోనే హక్కు..' అంటూ నినదించిన మహనీయుడు నేతాజీ అంటూ ఆయన సేవలను కొనియాడారు. భరతమాత బానిస శృంఖలాలు తెంచడానికి విదేశీ నేలపై తొలి స్వతంత్ర భారత సైన్యాన్ని, తొలి స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యోధుడని, జననమే తప్ప మరణం లేని మహా నేతగా భారత దేశ ప్రజల హృదయాల్లో 'నేతాజీ'గా చిరస్థాయిగా నిలచిన అమరుడు అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. నేటి సమాజం ఆయన ఆశయాలకు అనుగుణంగా పయనించాలని పిలుపునిచ్చారు.
Admin
Studio18 News