Monday, 30 March 2026 03:05:32 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Madhusudana Chary | జస్టిస్ సుదర్శన్ రెడ్డి వద్దని చెప్పినా.. సిట్ విచారణను ప్రభావితం చేసేలా రేవంత్ మాటలు : సిరికొండ మధుసూదనా చారి

Madhusudana Chary | నిన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి విద్వేష పూరిత ప్రసంగాలు వద్దని సూచించినా దాన్ని పెడచెవిన పెట్టి రేవంత్ కేసీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యల

Date : 03 February 2026 08:20 PM Views : 59

Studio18 News - TELANGANA / HYDERABAD : Madhusudana Chary | నిన్నకేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వెకిలి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. రేవంత్ మాటలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయి. కేసీఆర్ ఏనాడు కూడా విచారణ ను ఎదుర్కోను అని అనలేదు ..మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మొదటి నోటీసు విచారణకు టైమ్ కోరారు. ఎన్నో విచారణలను రెండేళ్లలో ఎదుర్కొన్నాం. దేనికి భయపడమన్నారు. కేసీఆర్ ముమ్మాటికీ జాతిపితే.. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర కేసీఆర్‌దన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిర స్థాయిగా ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డిది చీమ కాలంత ప్రమేయం కూడా లేదు. నిన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి విద్వేష పూరిత ప్రసంగాలు వద్దని సూచించినా దాన్ని పెడచెవిన పెట్టి రేవంత్ కేసీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని సిరికొండ మధుసూదనా చారి అన్నారు. రేవంత్ ది కుక్క తోక వంకర అనే బుద్ది. హార్వర్డ్ వెళ్లినా అంతరిక్షం వెళ్లినా రేవంత్ బుద్ది మారదు. గ్యారంటీల అమలు వదిలి గారడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు… కేసీఆర్ పదవులకు రాజీనామా చేసి సొంతగా పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు…రేవంత్ తన చిల్లర బుద్దిని చాటుకుంటూ కేసీఆర్‌పై అదే పనిగా పిచ్చి విమర్శలు చేస్తున్నారు. రేవంత్ విమర్శలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. తగిన బుద్దిచెబుతుందన్నారు మధుసూదనా చారి. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని.. జాతర నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేస్తామని సీఎం, మంత్రులు ఉత్తర కుమార ప్రగాల్భాలు పలికారు. 15 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కనీస ఏర్పాట్లు చేయలేకపోయారన్నారు మధుసూదనా చారి. ఇదొక్క వైఫల్యం చాలు రేవంత్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తోందో చెప్పడానికి. కేసీఆర్ హయాంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరిగింది. మాటలు తప్ప ఈ ప్రభుత్వంలో చేతలు లేవు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని మధుసూదనా చారి డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :