Sunday, 29 March 2026 05:24:09 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Kishan Reddy: వాడెవడో అర్జెంటినా నుంచి మెస్సీ వస్తే సింగరేణికి ఏం సంబంధం?: రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Date : 27 January 2026 07:50 PM Views : 119

Studio18 News - TELANGANA / HYDERABAD : మెస్సీ వచ్చినప్పుడు సింగరేణి నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని విమర్శ సింగరేణి కార్మికుల కష్టాన్ని మెస్సీ కార్యక్రమానికి ఖర్చు చేశారని మండిపాటు సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ఏడాది అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ వస్తే సింగరేణి నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి నిధులను గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దోచుకుంటోందని విమర్శించారు. "ఎవడో ఫుట్‌బాల్ ఆడుతాడట. వాడెవడో మెస్సీ ఇతర దేశాల నుంచి వస్తే నా సింగరేణికి ఏం సంబంధం? అతను వస్తే సింగరేణి నుంచి రూ.10 కోట్లు ఖర్చు పెట్టారు. సింగరేణిలో కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి, పెంచడానికి డబ్బులు లేవు. మెడికల్ రీయింబర్సుమెంట్స్ కోసం డబ్బులు లేవు. కానీ ఎవడో మెస్సీ వస్తే వానికి డబ్బులు ఇస్తాడు. అతనిని ఆడించడం కోసం నా సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బును అక్కడ ఖర్చు పెట్టాడనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారు?" అని ఆయన ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :