Studio18 News - TELANGANA / HYDERABAD : తెలంగాణ రాష్ట్రానికి త్వరలో కొత్త పోలీస్ బాస్ నియామకం జరగనుంది. డీజీపీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఎంపిక కమిటీ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. ప్రస్తుతం సీవీ ఆనంద్, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, వినాయక్ ప్రభాకర్ ఆప్టే పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. నలుగురిలో ఒకరి పేరు తీసేసి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రానికి పంపనున్నట్లు యూపీఎస్సీ వర్గాల సమాచారం. యూపీఎస్సీ పంపిన ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీవీ ఆనంద్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
Admin
Studio18 News