Monday, 16 March 2026 01:54:06 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Date : 08 March 2026 02:53 PM Views : 42

Studio18 News - TELANGANA / NIZAMABAD : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 14–15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను సుమారు 95 శాతం వరకు నివారించవచ్చని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తల్లిదండ్రులు తమ కుమార్తెలకు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. జిల్లాలో 14–15 ఏళ్ల వయస్సు గల 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్‌లో ఈ వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలన లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు డిచ్‌పల్లి, ధర్పల్లి, నవీపేట్, వర్ని, మోర్తాడ్, బాల్కొండ, ఆర్మూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు తప్పనిసరిగా సర్టిఫికెట్ తీసుకోవాలని, భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న హెల్త్ ప్రొఫైల్‌కు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. కొందరికి వ్యాక్సిన్ అనంతరం అలసట లేదా స్వల్ప జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చని, అటువంటి పరిస్థితుల్లో పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలెక్టర్ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 14–15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను సుమారు 95 శాతం వరకు నివారించవచ్చని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తల్లిదండ్రులు తమ కుమార్తెలకు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. జిల్లాలో 14–15 ఏళ్ల వయస్సు గల 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్‌లో ఈ వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలన లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు డిచ్‌పల్లి, ధర్పల్లి, నవీపేట్, వర్ని, మోర్తాడ్, బాల్కొండ, ఆర్మూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు తప్పనిసరిగా సర్టిఫికెట్ తీసుకోవాలని, భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న హెల్త్ ప్రొఫైల్‌కు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. కొందరికి వ్యాక్సిన్ అనంతరం అలసట లేదా స్వల్ప జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చని, అటువంటి పరిస్థితుల్లో పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలెక్టర్ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.

Developed By :