Thursday, 14 November 2024 07:26:43 AM
# #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు.. # కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం.. # బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత # లక్నో బయల్దేరిన రామ్ చరణ్

Bandi Sanjay: మూసీ వద్ద ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నాం: బండి సంజయ్

Date : 24 October 2024 03:42 PM Views : 29

Studio18 News - తెలంగాణ / : మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతను తాము వ్యతిరేకిస్తున్నామని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టును నిన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరుతో పరీవాహక ప్రాంతంలోని నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వడ్డీల రూపంలో పది నెలల్లోనే రూ.60 వేల కోట్లు చెల్లించారన్నారు. పాలకులు చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్రంపై, ప్రజలపై భారం పడుతోందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రభుత్వ దోపిడీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రం తాము వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :