Studio18 News - TELANGANA / SANGAREDDY : మంత్రి దామోదర్ రాజనర్సింహా అభిమానులు నివాసానికి తండోప తండాలుగా తరలివచ్చి వారి అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేలాదిగా అభిమానులు తరలివచ్చిన మంత్రి దామోదర్ రాజనర్సింహా ఓపికగా అభిమానులను కలిశారు.వారితో కలసి సంబరాలు జరుపుకున్నారు , కేకు లను కట్ చేసారు.తన నివాసానికి వచ్చిన వారితో కలసి తన సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం జోగిపేట పట్టణం లో పర్యటించారు.తన పుట్టిన సందర్బంగా జోగిపేటలో ఉన్న కస్తూరిభా బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కేజీబీవీ, నర్సింగ్ విద్యార్థినీలతో కలసి కేకు కట్ చేశారు. విద్యార్థినిలతో కలసి భోజనం చేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహా స్వయంగా విద్యార్థినులకు భోజనం వడ్డించారు. బాలాజీ హాస్పిటల్ వారి అద్వర్యం లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను , బ్లడ్ డొనేషన్ క్యాంపు లను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా కార్యకర్తలు , అభిమానులు జోగిపేట లోని శ్రీరామ గార్డెన్ లో మంత్రి దామోదర్ రాజనర్సింహా జన్మదిన వేడుకల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా బాలాజీ హాస్పిటల్ వారి అద్వర్యం లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను , బ్లడ్ డొనేషన్ క్యాంపు లను ప్రారంభించారు.అనంతరం దివ్యాoగులకు ట్రై సైకిల్స్ ను పంపిణి చేసారు.తరలివచ్చిన వేలాది మంది అభిమానులు మంత్రి దామోదర్ రాజనర్సింహాని గజమాలతో సత్కరించారు. భారీ బర్త్డే కేక్ ను తరలివచ్చిన అభిమానుల సమక్షం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా కట్ చేశారు.మంత్రి గారికి తరలివచ్చిన అభిమానులు ఒక్కొక్కరి కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Admin
Studio18 News