Studio18 News - తెలంగాణ / : Gossip Garage : అవును మనం వెనకబడిపోయాం. కారు దూసుకెళ్తుంది. కమలం కూడా తగ్గడం లేదు. అనుకున్నంత స్థాయిలో మన రియాక్షన్ ఉండటం లేదు. ఇక నుంచి ఇచ్చిపడేద్దాం. ఒకటి అంటే నాలుగు అనేద్దామని ఫిక్స్ అయిపోయిందట కాంగ్రెస్. ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వాలని నేతలకు ధైర్యం నూరిపోశారట ముఖ్యనేతలు. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలంటే..ఇప్పటి లెక్క ఉంటే అయితే కుదరదని డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ హస్తం యాక్షన్ ప్లానేంటి.? ఇప్పుడున్న పరిస్థితుల్లో అపోజిషన్‌కు ఇచ్చిపడేయడం అంత ఈజీనా.? విపక్షాల వ్యూహాలను చిత్తు చేసేందుకు సరికొత్త అస్త్రం.. ఇప్పటి దాకా ఓ లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది తెలంగాణ కాంగ్రెస్. అంటే పడ్డాం.. అపోజిషన్ కదా అని వదిలేశాం..ఇక కథ వేరే ఉంటదని చెప్తోంది. ప్రతిపక్షాల మాటకు ధీటుగా జవాబు ఇస్తామంటోంది. విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై మేధోమధనం చేస్తోంది. అందుకోసం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని చూస్తోంది కాంగ్రెస్. విపక్షాల వ్యూహాలను చిత్తు చేసేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్దం చేసుకుంటోంది. తిప్పకొట్టకపోతే జనం నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుందనే ఆందోళన.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు కావొస్తుంది. రైతు రుణమాఫీ నుంచి మూసీ సుందరీకరణ వరకు ప్రతీ అంశంపై అపోజిషన్ నుంచి ప్రెజర్ ఎదుర్కోటోంది అధికార పార్టీ. ఈ అంశాలపై జనంలో కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుండంటంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టకపోతే జనం నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తం అవుతుందని.. దీన్ని సాధ్యమైనంత త్వరగా యాక్షన్‌కు రియాక్షన్ ఉండాలని భావిస్తోంది. అందుకోసమే ఈ మధ్య కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం ఏర్పాటు చేసింది. కొత్త పీసీసీ చీఫ్‌కు సన్మానం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనే చర్చించారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన కార్పొరేషన్ ఛైర్మన్లతో పీసీసీ చీఫ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం.. కార్పొరేషన్ ఛైర్మన్ల సమావేశంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రధానంగా ఒక అంశాన్ని బలంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పదేళ్ల తర్వాత కార్యకర్తలు బలంగా పోరాడి సాధించిన అధికారాన్ని కలిసి కట్టుగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని సెంటిమెంట్‌ను రగిలించారట. ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తున్నా..వాటిని జనంలోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో విఫలమవుతున్నామనే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసినా అనుకున్నంత పాజిటివ్ రాకపోగా..జనంలో నెగిటివ్ అవుతున్నామని ప్రస్తావించారు. రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామనే భరోసా క్యాడర్‌కు కల్పించాలని నేతలకు దిశానిర్దేశం చేశారట. ఇక హైడ్రా విషయంలో విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్న విషయాన్ని కూడా చర్చించారు. చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ విషయంలో ప్రజల్లో పాజిటివ్ చర్చ జరిగేలా ప్రయత్నించాలని సీఎం, పీసీసీ చీఫ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. పరిస్థితి చేయిదాటి.. అందరూ మునిగే ప్రమాదం..! ఇక మూసీ సుందరీకరణ విషయంలో పార్టీ గొంతు ఏమాత్రం జనంలోకి పోవడం లేదని అటు సీఎం, ఇటు పీసీసీ చీఫ్ ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ విషయంలో గతంలో బీఆర్‌ఎస్, బీజేపీలు చెప్పిన హామీలను జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందనే భరోసా కల్పించడంలో వెనకబడిపోయామన్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ కూడా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను జనంలోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో పార్టీ ముందుండాలని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తేనే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ వస్తుందని లేకపోతే పరిస్థితి చేయిదాటి..అందరూ మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో అపోజిషన్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ వేస్తున్న యాక్షన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Admin
Studio18 News