Friday, 14 February 2025 06:50:45 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

#JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు.

Date : 26 January 2025 12:38 AM Views : 87

Studio18 News - TELANGANA / JOGULAMBA GADWAL : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ పోరు భగ్గుమనింది. గద్వాల జిల్లా కేంద్రంలో అమృత్ 2.0 పథకం ప్రారంభం కార్యక్రమనికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టణానికి చేరుకున్నారు. మార్గమధ్యంలోనే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి శాలువా కప్పి పూలదండతో సత్కరించారు.అనంతరం అక్కడి నుంచి సభాస్థలికి వెళ్లగా సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్టేజిపై నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా ఆహ్వానితులు ఆహ్వానించారు. అలా ఒక్కో ప్రజాప్రతినిధిని అధికారి పిలిచి చివరకు అక్కడే ఉన్న మాజీ జడ్పీ చైర్ పర్సన్ అయిన సరితను పిలువకపోవడంతో ఒక్కసారిగా సరిత వర్గం ఆగ్రహం వెలుబుచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనతో సరిత వర్గీయులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా .. మనస్థాపానికి గురైన మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత తన అనుచరులతో కలిసి కార్యక్రమాన్ని బహిష్కరించి కారులో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటన సందర్భంగా గద్వాలలో ఎలాంటి గొడవలు జరగకుండగా పోలీసులు ముందుజాగ్రత్తగా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ వర్గానికి మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత వర్గానికి మధ్య జరుగుతున్న పోరు మంత్రి పర్యటన సందర్భంగా మరోసారి బయటపడటంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైన కాంగ్రెస్ అధిష్టానం వీరిద్దరి మధ్య సయోద్యను కుదురుస్తారో లేదో అని స్థానికులు బహిరంగంగానే మాట్లాడటం ఇప్పుడు గద్వాలలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :