Sunday, 29 March 2026 05:22:28 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం

Date : 06 December 2025 06:44 PM Views : 303

Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‎లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో దాదాపు 60 నుంచి 70 క్వింటాళ్ల వరకు ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి పూర్తిగా కాలి బూడిదైంది. యాదవ సంఘం సమీపంలో నివాసముంటున్న పెరుగు జలంధర్ ఇంటిలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.ఇంట్లో నిల్వ చేసిన భారీ మొత్తంలో పత్తి ఉండడంతో అగ్ని వేగంగా వ్యాపించి క్షణాల్లో పూర్తిగా దగ్దమైంది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుని, సుమారు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా నియంత్రించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాలిపోయిన పత్తి విలువ సుమారుగా 60 నుండి 70 క్వింటాళ్లు ఉంటుందని అంచనా వేశారు.దీంతో రైతు జలంధర్ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి, తక్షణమే ఆదుకోవాలని భాదితులు కోరుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :