Saturday, 14 December 2024 03:55:21 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Telangana: ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు ..ఏకంగా 16మంది విఆర్‌కు ఆటాచ్

Date : 04 October 2024 11:53 AM Views : 42

Studio18 News - తెలంగాణ / : ఇసుక అక్రమ దందాను నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మల్టీ జోన్ – 2 పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో బాధ్యులను గుర్తించి వారిపై వేటు వేశారు. ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను వేకెన్సీ రిజర్వ్ (విఆర్)కు పంపించారు. ఈ మేరకు జోన్ ఐజీపీ వి.సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర నిఘా వర్గాల నివేదికలు, విచారణల అధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఐజీ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. వేటు పడిన వారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ ఇన్స్‌పెక్టర్‌లతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పునూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్ఐలు ఉన్నారు. గతంలో ఇదే వ్యవహారంలో ఒక ఇన్స్‌పెక్టర్, 14 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వీరిలో కొందరు ఇసుక అక్రమ దందా ముఠాలతో చేతులు కలిపినట్లు గుర్తించారు. ఇసుక అక్రమ రవాణాలో వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో కొండమల్లేపల్లి హోంగార్డు, జడ్చర్ల హెడ్ కానిస్టేబుల్‌ను ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వుడ్ కార్యాలయాలకు అటాచ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :