Studio18 News - TELANGANA / HANUMAKONDA : కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ టీటీడీ కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు లెక్కింపునకు పది రోజుల సమయం పట్టే అవకాశం ఆసియా అతిపెద్ద గిరిజన జాతర మేడారం హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హుండీల లెక్కింపునకు పది రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. రెండేళ్లకోసారి వచ్చే ఈ మహా జాతర గత నెల 28 నుంచి 31 వరకు జరిగింది. సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు. జాతరకు నెల రోజుల ముందు, జాతర అనంతరం మరికొన్నిరోజులు మేడారంను భక్తులు సందర్శిస్తారు. ఈ మహా జాతర హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. ఈరోజు మంత్రి కొండా సురేఖ కొబ్బరికాయ కొట్టి లెక్కింపును ప్రారంభించారు. మేడారం జాతరకు తరలి వచ్చిన భక్తులు అమ్మవార్లకు కానుకలు సమర్పించుకున్నారు. క్రితంసారి మేడారం జాతరకు రూ.13 కోట్ల ఆదాయం సమకూరింది.
Admin
Studio18 News