Studio18 News - TELANGANA / : టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సమావేశం కావడం పట్ల ప్రముఖ నటి, నిర్మాత ఛార్మీ కౌర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. వారి విజనరీ నాయకత్వం, చిత్ర పరిశ్రమ పట్ల వారి స్థిరమైన నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు. "ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సినీ పరిశ్రమకు, సమాజానికి లబ్ధి చేకూర్చే సంక్షేమ కార్యక్రమాల పట్ల చైతన్యం కలిగించేందుకు మనస్ఫూర్తిగా తోడ్పాటు అందిస్తాను. కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన కలిగించేందుకు కట్టుబడి ఉంటాను. చిత్ర పరిశ్రమ ఉజ్వల భవిష్యత్తుకు కలసికట్టుగా కృషి చేద్దాం" అని ఛార్మీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read : అల్లు అర్జున్ వివాదంపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడలేదు: మురళీ మోహన్
Admin
Studio18 News