Friday, 14 February 2025 08:12:42 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Date : 24 January 2025 05:56 PM Views : 53

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. కిడ్నీ రాకెట్‌ ముఠాల డొంక కదిలించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన అన్ని కిడ్నీ ఆపరేషన్లపై సీఐడీ విచారణకు ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్‌ మహానగరంలోని సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో అనుమతి లేకుండా కిడ్పీ మార్పిడులు చేయడంతోపాటు.. గుట్టుచప్పుడు కాకుండా 55 లక్షలు రూపాయలు కాజేసేందుకు కొందరు కేటుగాళ్లు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. అయితే.. వైద్యశాఖ అధికారులకు సమాచారం అందడంతో గుట్టురట్టు అయింది. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి జరిగినట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో.. అలకనంద ఆస్పత్రి యాజమాని సుమంత్ సహా 8మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఈ క్రమంలోనే.. అలకనంద ఆస్పత్రి ఎండీ సుమంత్‌, రిసెప్షనిస్ట్‌ గోపిని కోర్టులో హాజరుపర్చడంతో రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. పోలీసుల అదుపులో ఉన్న మరో ఆరుగురిని విచారిస్తున్నారు. కిడ్నీ డోనర్లు, గ్రహీతలకు సర్జరీ ఎక్కడ చేశారు? ఈ దందాలో ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు కూపీ తీస్తున్నారు. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇక.. కిడ్నీ రాకెట్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వైద్యుల కమిటీ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నైకి చెందిన పూర్ణిమ మధ్యవర్తిగా ఉన్నట్టు కమిటీ విచారణలో తేలింది. దీనికి సంబంధించి హెల్త్ సెక్రటరీకి ప్రత్యేక వైద్యుల కమిటీ నివేదిక కూడా అందించింది. కిడ్నీ డోనర్లు, కిడ్నీ తీసుకున్నవారి వివరాలు సేకరించి.. వారికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తేల్చారు. అటు.. అలకనంద ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్‌ చేశారు. మరోవైపు.. తెలంగాణలో కొన్నేళ్లుగా జరిగిన కిడ్నీ మార్పిడుల డొంక కదిలించేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ రెడీ అవుతోంది. అలకనంద ఆస్పత్రి ఘటనతో అలెర్ట్‌ అయిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లపై దర్యాప్తు చేయాలని ఆదేశించడం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :