Studio18 News - TELANGANA / HYDERABAD : అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతిని కాంగ్రెస్ నేతలు నిర్వహించారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హెచ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నిన్న బీసీ రిజర్వేషన్ల కోసం.. తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించారు. బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మార్పణ చేసుకున్న సాయి ఈశ్వర్ చారి మృతికి నాయకులు సంతాపం తెలిపారు. బీసీ రిజర్వేషన్ కోసం ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను శంకించాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతారని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం అన్నారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. కేంద్రంలోరాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఖాయం అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం అని.. బీసీ బిల్లు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో బిల్లు ఆమోదిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతందని.. అది రాహుల్ గాంధీ వల్లే సాధ్యం అవుతుందన్నారు. అనంతరం అంబర్పేట్ శ్రీ రమణ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి , నివాళులు అర్పించారు.
Admin
Studio18 News