Sunday, 29 March 2026 05:23:34 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Medaram Jatara: మేడారంలో ఆకాశాన్నంటుతున్న కోళ్లు, మేకలు, గొర్రెల ధరలు

Date : 29 January 2026 07:24 PM Views : 117

Studio18 News - TELANGANA / MULUGU : భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం అమ్మవార్లకు భారీగా బలులు ఇస్తున్న భక్తులు దీన్ని ఆసరాగా చేసుకుని ధరలను పెంచేసిన వ్యాపారులు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ. దీంతో, మేడారంలో కోళ్లు, మేలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు వీటి ధరలను అమాంతం పెంచేశారు. సాధారణంగా కిలో రూ. 200 నుంచి రూ. 250 ఉండే కోడి ధర, జాతరలో రూ. 350 నుంచి రూ. 400 వరకు పలుకుతోంది. ఇక మేకలు, గొర్రెల పరిస్థితిలో కూడా తేడా లేదు. సాధారణ రోజుల్లో రూ. 7 వేల నుంచి రూ. 8 వేల వరకు పలికే మేక పోతులను ప్రస్తుతం రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు విక్రయిస్తున్నారు. ధరలు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, మొక్కుబడి తీర్చుకోవాలనే ఉద్దేశంతో భక్తులు భరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేస్తున్నారు. జాతర ముగిసే వరకు ఈ ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :