Studio18 News - తెలంగాణ / : బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద విషపూరితమైన పాములు బయటపడడం కలకలం సృష్టించింది. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇలా పాములు లభ్యమయ్యాయి. తనిఖీల్లో పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించిన విషయం తెలిసి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ ప్రయాణించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటి అని వారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్ నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక ప్రయాణికుల వద్ద దొరికిన ఆ పాములను అనకొండలుగా అధికారులు గుర్తించారు.
Also Read : పత్తి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు: విజయసాయిరెడ్డి ట్వీట్
Admin
Studio18 News