Studio18 News - TELANGANA / HYDERABAD : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వరుస ట్వీట్లతో రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత విషం చిమ్మినా కాళేశ్వరం తెలంగాణ దాహం తీరుస్తోందని అన్నారు. మల్లన్నసాగర్ వద్దని నిరాహార దీక్షలు మీరు చేసినా నేడు మహానగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్న సాగర్ అని కేటీఆర్ అన్నారు.
Also Read : ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు
కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని ప్రచారం చేసినా తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు అని, ఇప్పుడైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పారు. లక్షకోట్ల నష్టం వాటిల్లిందని అబద్ధపు ప్రచారాలు చేశారు. అధికారం కోసం కాళేశ్వరాన్ని నిందించినా.. నేడు ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ మరో ట్వీట్ లో.. ‘‘రైతు భరోసా ఇవ్వలేదు.. రుణమాఫీ సక్కగా చేసింది లేదు.. పెన్షన్ పెంచింది లేదు.. ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు. కానీ, ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేలకోట్ల ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు అక్షరం మార్పుకోసం అక్షరాల 1000 కోట్ల ఖర్చా? వెయ్యి కోట్లు కాదు లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. తెలంగాణ అస్థిత్వాన్ని చెరపలేవు! నాలుగు కోట్ల గుండెలపై కేసీఆర్ చేసిన సంతకాన్ని మార్చలేవు.’’ అంటూ కేటీఆర్ రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
Admin
Studio18 News