Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ (ఏటీసీ)లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నైపుణ్య శిక్షణలో రూపొందించిన చెక్కపై ఎమ్మెల్యే చిత్రాన్ని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వర్ రెడ్డి, మౌనికలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, నియోజకవర్గాల్లో ఐటీఐలను రూ.35 కోట్ల చొప్పున అప్‌గ్రేడ్ చేసి, 65 ఏటీసీ కేంద్రాల ద్వారా యువతకు స్కిల్ కోర్సులు అందించి ఉపాధి అవకాశాలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జగిత్యాలలో ఏటీసీ కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 15 రోజుల వ్యవధిలో ఆరు బ్యాచ్‌లకు సర్టిఫికెట్ కోర్సులు అందిస్తున్నామని, యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులకు రహదారి సౌకర్యం కల్పించేందుకు మంత్రి శ్రీధర్ బాబు చొరవతో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
Admin
Studio18 News