Sunday, 29 March 2026 05:23:57 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Mahesh Kumar Goud: తెలంగాణలో బీసీ నేత సీఎం అయ్యే సమయం వస్తుంది: మహేశ్ కుమార్ గౌడ్

Date : 22 January 2026 06:58 PM Views : 205

Studio18 News - TELANGANA / HYDERABAD : అవకాశం ఉన్న ప్రతి చోట బీసీలకు పదవులు ఇస్తున్నామన్న మహేశ్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యమని వెల్లడి దేవుళ్ల పేరుతో రాజకీయాలు మంచిది కాదని వ్యాఖ్య కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ నేత ముఖ్యమంత్రి అయ్యే ఆ సమయం తప్పకుండా వస్తుందని అన్నారు. మున్ముందు బీసీలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, అవకాశం ఉన్న ప్రతి చోట బీసీలకు పదవులు ఇస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. కష్టపడి పనిచేస్తే ఎవరి వాటా వాళ్లకు దక్కుతుందని, దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరని మహేశ్ గౌడ్ అన్నారు. రాబోయే రోజులు అన్నీ బీసీలవే అని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం దేశానికి మంచిది కాదని, కులం, మతం పేరుతో మన పిల్లలకు భవిష్యత్తు రాదని వ్యాఖ్యానించారు. రాముడు, అంజనేయుడి పేర్లు చెప్పి బీజేపీ నేతలు ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. అర్వింద్ ‘జై శ్రీరాం’ అని కాకుండా, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి తాను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడగాలని హితవు పలికారు. రాముని పేరు చెప్పడం తప్ప నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏం చేశారో వివరించాలన్నారు. దేవుళ్లను రాజకీయాలతో ముడిపెట్టవద్దని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :