Sunday, 29 March 2026 05:25:40 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Jaggareddy: 60 సీట్లున్న బస్సులో 100 మంది ఎక్కితే గొడవలు కావా?: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Date : 07 February 2026 06:40 PM Views : 36

Studio18 News - TELANGANA / SANGAREDDY : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్న జగ్గారెడ్డి ఉచిత బస్సు పథకంపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తోందని వ్యాఖ్య తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అయితే ఉచిత బస్సు పథకంతో మహిళలు ఘర్షణలకు దిగుతున్నారంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది ఎక్కితే గొడవలు కావా అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. బియ్యం తక్కువ ఉన్నా తినేవాళ్లు ఎక్కువగా ఉన్న చందంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ తమ ప్రభుత్వం క్రమంగా అన్ని హామీలను నెరవేరుస్తోందని అన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఒక్కో వార్డుకు రూ.8 కోట్లు మంజూరు చేయిస్తానని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రూ.300 కోట్లు తీసుకువస్తానని అన్నారు. 2013లో 5,500 మందికి ఇంటి స్థలాలు ఇచ్చానని గుర్తు చేశారు. గత పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటి స్థలాలు ఇప్పిస్తానని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణ మొత్తం తిరుగుతానని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :