Studio18 News - TELANGANA / NIZAMABAD : సిరికొండ మండలం న్యావనంది గ్రామ శివారులోని కుర్దుల్‌పేట్ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పను అధికారులు గుర్తించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆర్‌సీ పురం శాఖ అధికారులు ఆ ఇసుకను గుర్తించి పోలీస్ శాఖకు అప్పగించారు. ఈ ఘటనపై ఫిబ్రవరి 25న పంచనామా నిర్వహించి ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం నిజామాబాద్ మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సిరికొండ తహసీల్దార్ కార్యాలయం నుంచి లేఖ ద్వారా సమాచారం అందజేశారు. మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఆదేశాల మేరకు సుమారు 60 క్యూబిక్ మీటర్ల ఇసుకకు రూ.38,520 విలువగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న ఇసుకను మార్చి 9న ఉదయం 10 గంటలకు కుర్దుల్‌పేట్ వెంచర్‌లో రాజు ఖాళీ స్థలంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రవీందర్రావు తెలిపారు. వేలంపాటలో పాల్గొనదలచిన వారు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.
Admin
Studio18 News