Sunday, 08 March 2026 03:40:56 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

ఎరుకల నాంచారమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

ములుగు జిల్లా రామానుజపురంలో జరుగుతున్న ఎరుకల నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) హాజరయ్యారు. నాంచారమ్మ తల్లిని దర్శ

Date : 12 May 2025 05:49 PM Views : 526

Studio18 News - TELANGANA / : ములుగు: ములుగు జిల్లా రామానుజపురంలో జరుగుతున్న ఎరుకల నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) హాజరయ్యారు. నాంచారమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎరుకల నాంచారమ్మ జాతర సందర్భంగా ఎరుకల సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎరుకల ఆత్మగౌరవం కోసం 6 గంటలు ప్రయాణించి హైదరాబాద్ నుంచి ఈ జాతరకు వచ్చానని చెప్పారు. జాతర ప్రభుత్వం చేయూతనివ్వాలని, మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల నాంచారమ్మ జాతర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఆలయ నిర్మాణంలో తమ పాత్ర కూడా ఉంటుందని తెలిపారు. అత్యంత వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గం నుంచి పారిశ్రామికవేత్తలు కావాలని ఎరుకల ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను కేసీఆర్ అమలు చేశారని వెల్లడించారు. Kavitha 1 అంతకుముందు ఆలయం వద్ద తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు, కేతిని రాజశేఖర్, లోకిని సమ్మయ్య, మానపాటి రమేష్, ఇతర ఆదివాసీ ఎరుకల సంఘం నాయకులు కవితకు ఘనంగా స్వాగతం పలికారు. ఎరుకల కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :