Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవ పథకం (NSS) ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల స్టాఫ్ ఆధ్వర్యంలో NSS వాలంటీర్లు పాల్గొని తరగతి గదులు, ల్యాబ్‌లు మరియు కళాశాల ఆవరణలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో NSS యూనిట్-2 ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీమతి మార్కొండ శకుంతల, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. ఏ. ప్రసాద్, స్టాఫ్ సెక్రటరీ జి. శ్రీధర్ రావు, డా. ఎస్. కృష్ణ ప్రసాద్, డా. కరుణ, డా. జైపాల్, పూర్వ విద్యార్థి మరియు గర్జనపల్లి సర్పంచ్ రాకేష్ గౌడ్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, NSS వాలంటీర్లు, విద్యార్థులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.
Admin
Studio18 News