Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని సీతయ్యపేట గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. సఫాయి కార్మికులు డ్రైనేజీలను శుభ్రం చేయగా సర్పంచ్ సిహెచ్ భూమేష్ పనులను పర్యవేక్షించారు. గ్రామ అభివృద్ధి దృష్ట్యా ప్రతి వారం డ్రైనేజీలను శుభ్రం చేయిస్తామని, ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రకాంత్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Studio18 News