Studio18 News - TELANGANA / SANGAREDDY : నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. మొత్తం 196 గ్రామ పంచాయతీల కోసం ఐదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, గ్రామాల్లో రాజకీయ చర్చలు, సమీకరణలు, అభ్యర్థుల పరుగులు మొదలయ్యాయి. నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు అభ్యర్థులు, మద్దతుదారులు, పార్టీ నాయకులు సంబంధిత ఎంపీడీవో కార్యాలయాలను సందర్శిస్తున్నారు. మూడో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఎలా మారనున్నాయి? ఏ గ్రామాల్లో ఎవరికి బలం? ఏ గ్రామాల్లో పోటీ హాట్‌గా మారుతుందనే ఆసక్తి వెల్లువెత్తుతోంది.అభ్యర్థుల నామినేషన్ దాఖలు చివరి తేదీ దగ్గరపడుతోన్నందున ముందున్న రోజుల్లో కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది.
Admin
Studio18 News