Thursday, 12 March 2026 12:18:20 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Date : 07 February 2026 07:27 PM Views : 120

Studio18 News - TELANGANA / HYDERABAD : నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం ఓటుకు నోటు కేసు వాయిస్ రికార్డింగులను నాశనం చేసే ప్రయత్నంగా కనిపిస్తోందన్న కేటీఆర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్న అధికారులు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగులను, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు లేకపోవడాన్ని కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందిస్తూ... ల్యాబ్ మొత్తం కాలిపోతోందని, ఏయే ఆధారాలు నాశనం చేశావు అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రమాదం వివరాల్లోకి వెళితే... ల్యాబ్ లోని తొలి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే భవనంలోని ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం కారణంగా ల్యాబ్ లోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు దెబ్బతిన్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :