Saturday, 14 December 2024 03:35:51 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు.. ‌పాగ‌ల్ ప‌నులు: కేటీఆర్‌

Date : 18 October 2024 12:04 PM Views : 22

Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై దుమ్మెత్తిపోశారు. పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు... పాగ‌ల్ ప‌నులు... వెర‌సి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్లు ప‌రిపాల‌న ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అభివృద్ధి చేయ‌డం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్... త‌నకు అంటిన బుర‌ద‌ను అంద‌రికీ అంటించాల‌ని చూస్తోందని విమ‌ర్శించారు. మూసీ ప్రాజెక్టుతోనే హైద‌రాబాద్ అభివృద్ధి అవుతుంద‌న్న చేత‌కాని ద‌ద్ద‌మ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంద‌ని అన్నారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. * మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (ప‌ర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబ‌ర్‌వ‌న్ అయింది * మూసీ ప్రాజెక్టులో రూ. 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానం సాధించింది. * బిల్డ‌ర్ల‌ను, రియ‌ల్ట‌ర్ల‌ను బెదిరించ‌కుండానే ఐటీ ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరును హైద‌రాబాద్ దాటేసింది. * మీ బడే భాయ్ మోదీ ఐటీఐఆర్‌ని రద్దు చేసినా తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, ఐటీ ఎగుమతులలో 2035లో చేరుకోవాల్సిన టార్గెట్‌ను పదకొండేళ్ల ముందే 2023లో చేర్చిన ఘనత కేసీఆర్ నాయకత్వానిది. * ఢిల్లీకి డ‌బ్బు సంచులు పంప‌కుండానే తెలంగాణ విత్త‌న భాండాగార‌మైంది. దేశంలోనే ధాన్య‌రాశిగా మారింది. * పేద‌ల కంట క‌న్నీరు లేకుండానే పారిస్, బొగాట‌, మెక్సికో సిటీ, మాంట్రియ‌ల్‌ల‌ను అధిగ‌మించి ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ గ్రీన్ సిటీ అవార్డును హైద‌రాబాద్‌ ద‌క్కించుకుంది. మూసీ న‌దికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హ‌ర్మ్యాలు క‌డుతున్న‌ప్పుడు మ‌రి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ ప‌క్క‌న పెట్టుబ‌డి పెట్టేందుకు ఫోర్ బ్ర‌ద‌ర్స్ మ‌నీ స్పిన్నింగ్ కోస‌మా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు? అంటూ కేటీఆర్ నిల‌దీశారు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. స‌మావేశాల్లో త‌ల కింద‌కి, మీద‌కి తిప్పితేనో అభివృద్ధి జ‌ర‌గ‌ద‌ని చుర‌క‌లంటించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలలో చ‌దువుకున్నా అంటూ ప్ర‌భుత్వ బ‌డి పిల్ల‌ల ఇజ్జ‌త్ తీయ‌కు అని రేవంత్ రెడ్డిని విమ‌ర్శించారు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుత‌మైన ఇంగ్లిష్ మాట్లాడ‌తారు. ప్ర‌పంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నార‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :