Studio18 News - TELANGANA / SANGAREDDY : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన గొంగుల సంధ్య నవీన్ రెడ్డి, ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం గ్రామంలో ఎన్నికల సమయంలో వితంతు పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధులతో 19వ వార్డు సభ్యులకు వితంతు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రజా సేవే ధ్యేయంగా, వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఇస్నాపూర్ మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ 19వ వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Studio18 News