Studio18 News - TELANGANA / KARIMNAGAR : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సంచార చేపల విక్రయ వాహనాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ వాహనాన్ని ముల్కనూర్ గ్రామానికి చెందిన పెసరి పద్మ సురేష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. కరీంనగర్ జిల్లాకు రెండు సంచార చేపల విక్రయ వాహనాలు మంజూరు అయ్యాయని, తన చొరవతో చిగురుమామిడి మండలానికి ఒక వాహనం అందించామని చెప్పారు. రాబోయే రోజుల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి మరో 18 వాహనాలు మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సంచార చేపల విక్రయ వాహనం ద్వారా మత్స్యకారుల ఆదాయం పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి మత్స్యకార కుటుంబం దీన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వృత్తిపరమైన అవకాశాలను అర్హులైన వారికి అందజేస్తామని మంత్రి వివరించారు.
Admin
Studio18 News