Studio18 News - TELANGANA / RANGAREDDY : ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవి కుమార్ జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు శాలువాలు కప్పి, పూల బొకేలు అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News